ఇంటర్వ్యూ: అనిల్ రావిపూడి – రవితేజ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చూస్తారు !

ఇంటర్వ్యూ: అనిల్ రావిపూడి – రవితేజ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చూస్తారు !

Published on Oct 17, 2017 12:36 PM IST


‘పటాస్, సుప్రీం’ ఫేమ్ అనిల్ రావిపూడి తాజాగా రవితేజ హీరోగా ‘రాజా ది గ్రేట్’ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం రేపే రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం…

ప్ర) రవితేజకి అంధుడి పాత్ర రాయాలని ఎలా అనిపించింది ?
జ) కమర్షియల్ సినిమాల్లో క్రియేటివిటీకి తాకేజువా స్కోప్ ఉంటుంది. అందుకే నా సినిమాలో ఏదైనా కొత్తగా చూపాలని అనుకుంటున్నప్పుడు నా హీరోకి చూపు లేకపోతే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. ఆ తర్వాత మోహన్ లాల్ గారు అంధుడిగా చేసిన సినిమా చూశాను. దాంతో నా ఆలోచన మరింత బలపడి ఈ కథ తయారుచేసుకున్నాను.

ప్ర) కథ వినగానే రవితేజ ఎలా ఫీలయ్యారు ?
జ) మొదటి సగం వినగానే సందేహించారు కానీ పూర్తిగా చెప్పేటప్పటికీ ఎగ్జైట్ ఫీలై వెంటనే ఒప్పేసుకున్నారు. ఇప్పటి వరకు ఇదే రవితేజగారి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పగలను. ఇందులో ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కుతాయి.

ప్ర) చూపులేని పాత్రను ఏ విధంగా ప్రెజెంట్ చేశారు ?
జ) ఇందులో హీరోకి పుట్టుకతోనే చూపు ఉండదు. అలాంటి హీరో చిన్నతనం నుండి ఎలా పెరిగాడు అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. హీరో తల్లి తన కొడుకు పెద్దయ్యాక పోలీస్ అవ్వాలని అనుకుంటుంది. అలా హీరో ఒక పోలీస్ మిషన్లో చేరి దాన్ని ఎలా పూర్తిచేశాడు అనేదే సినిమా.

ప్ర) హీరోని చూపులేని వ్యక్తిగా చేయడం రిస్క్ అనిపించలేదా ?
జ) స్క్రిప్ట్ రాసుకునేప్పుడు కొంత భయమేసింది. కానీ షూటింగ్ జరిగేప్పుడు, రషెస్ చూసుకున్నాక కాన్ఫిడెన్స్ వచ్చింది.

ప్ర) హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ ఎలా ఉంటుంది ?
జ) హీరోకి చూపు ఉండదు కాబట్టి పెద్దగా రొమాన్ పెట్టలేదు. రొమాంటిక్ సీన్స్ అన్నీ మెచ్యూర్డ్ గానే ఉంటాయి. ఎక్కడా డ్రీమ్ సాంగ్స్ ఉండవు. ప్రతి పాట ఒక కాన్సెప్ట్ తో ఉంటుంది.

ప్ర) సినిమా చూశాక దిల్ రాజు ఎలా ఫీలయ్యారు ?
జ) ఆయనెప్పుడూ నన్ను పొగడలేదు. కానీ సినిమా చూశాక నా టేకింగ్, సెకండాఫ్లో హీరో పాత్రని చూపించిన విధానానికి ఎక్కువగా అభినందించారు.

ప్ర) ఎన్టీఆర్ తో ఒక సినిమా అనుకున్నారు కదా ఏమైంది ?
జ) నేను స్క్రిప్ట్ లో కొంత భాగం మాత్రమే ఆయనకు చెప్పను. కొన్ని ఆబ్లిగేషన్స్ ఉండటం వలన ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు. మరో కొత్త కథతో త్వరలోనే ఆయన్ను కలుస్తా.

ప్ర) నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ?
జ) ముందు ఈ సినిమా ఫలితం చూసిన తర్వాతే నెక్స్ట్ సినిమా గురించి ఆలోచిస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు