అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ నటన అద్భుతమంటున్న జక్కన్న !

అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ నటన అద్భుతమంటున్న జక్కన్న !

Published on Apr 23, 2017 12:11 PM IST


ఈ ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న ‘బాహుబలి – ది కంక్లూజన్’ చిత్రాన్ని చూడాలని యావత్ భారతీయ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులైతే తమ అభిమాన హీరో ప్రభాస్ అమరేంద్ర బాహుబలిగా ఎలా ఉంటాడో చూడాలని తెగ ఆరాటపడిపోతున్నారు. వారి ఆరాటాన్ని ఇంకాస్త పెంచేలా దర్శకుడు రాజమౌళి ప్రభాస్ పాత్ర గురించిన ఒక్కో ముఖ్య అంశాన్ని రివీల్ చేస్తూ వస్తున్నారు.

తాజా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడిన జక్కన్న ‘ప్రభాస్ తన మూడున్నరేళ్ల పూర్తి కాలాన్ని బాహుబలి కోసం కేటాయించాడు, అతని ద్దేడికేషన్ వాలనేప్రాజెక్ట్ సాధ్యమైంది. మొదటి భాగం కన్నా రెండవ భాగంలో ఏమోషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రభాస్ అమరేంద్ర బాహుబలిగా తన పూర్తి నటనను ప్రదర్శించాడు’ అన్నారు. ఇకపోతే నిన్న విడుదలైన ‘సాహోరె బాహుబలి’ ప్రోమో సాంగ్ విజువల్స్ ప్రేక్షకుల్ని మరోసారి ఆశ్చర్య చకితుల్ని చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు