రాజమౌళి, ధోనీని ఏ కోరిక కోరాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

dhoni-rajamouli
సాధారణంగా వేదిక మీద ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్న వ్యక్తి, కోట్లాది అభిమానులు హీరోగా భావించే వ్యక్తి ఎమ్ఎస్ ధోని ఉండి అదే వేదిక మీద నేషనల్ లెవల్ డైరెక్టర్ ఒకరు ఉంటే, ఆ డైరెక్టర్ కి ధోనిని ఏమన్నా ప్రశ్నలు అడిగే అవకాశం వస్తే అతను ఎక్కువ శాతం ‘ధోనిగారు మీరు నా సినిమాలో ఎప్పుడు నటిస్తారు ? లేదా మీరు సినిమాల్లోకి ఎప్పుడొస్తారు ?’ అన్న ప్రశ్నలే అడిగే అవకాశముంది. కానీ మన జక్కన రాజమౌళి మాత్రం అవేమీ అడగలేదు. తన స్థాయికి తగ్గట్టు హుందాగా, అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఒకేఒక్క కోరిక కోరారు.

వివరాల్లోకి వెళితే ఎమ్ఎస్ ధోని బయోపిక్ గా తెరకెక్కిన ‘ఎమ్ఎస్ ధోని – అన్ టోల్డ్ స్టోరీ’ చిత్రం హిందీతో పాటు తెలుగులో కూడా విడుదలవుతున్న సందర్బంగా ఈరోజు హైదరాబాద్ లో తెలుగు ఆడియో వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ధోని విచ్చేయగా టాలీవుడ్ తరపున రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆ సందర్భంలో హోస్ట్ సుమ రాజమౌళిగారు ధోనీని ఏమన్నా అడగాలనుకుంటే అడగండి అని మైక్ ఆయన చేతికిచ్చింది. వెంటనే రాజమౌళి ధోనీ గురించి మాట్లాడి చివరగా ‘ధోనిగారిని నేను ప్రశ్నలేమీ అడగను కానీ కోట్ల మంది అభిమానుల తరపు నుండి రాబోయే వరల్డ్ కప్ మాత్రం గెలమని అడుగుతున్నాను’ అని అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో అభిమానాలు సైతం భావోద్వేగంతో కేరింతలు కొట్టారు. ఇక నీరజ్ పాండే డైరెక్ట్ చేసిన ఈ చిత్రం

 

Like us on Facebook