రాజమౌళి శిష్యుడి దర్శకత్వంలో కొత్త సినిమా !

రాజమౌళి శిష్యుడి దర్శకత్వంలో కొత్త సినిమా !

Published on Oct 20, 2017 11:57 AM IST


కరుణ కుమార్ రాజమౌళి శిష్యుడు, గతంలో నితిన్ తో ద్రోణ సినిమాకు దర్శకత్వం వహించారు. చాలా గ్యాప్ తరువాత ప్యూర్ లవ్ స్టొరీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. లవర్స్, కేరింత సినిమాలతో లవర్ బాయ్ గా ఇమేజ్ తెచ్చుకున్న సుమంత్ అశ్విన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ప్రముఖ నిర్మాత మల్కాపురం శివ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

యూత్ ఫుల్ లవ్ సబ్జెక్టు తో తెరకెక్కబోతున్న ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది, రైటర్ భవాని ప్రసాద్ రచయితగా పని చేస్తున్న ఈ సినీమాకు సంభందించిన పూర్తి వివరాలు మీడియాతో పంచుకొనున్నారు చిత్ర యూనిట్, ఈ సినిమాతో డైరెక్టర్ కరుణ కుమార్ మంచి విజయం తన ఖాతాలో వేసుకోవాలని, అలాగే సుమంత్ అశ్విన్ హీరోగా మరో మెట్టు ఎక్కాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు