రజిని ప్రశంసతో పరవశిస్తున్న రాజమౌళి

రజిని ప్రశంసతో పరవశిస్తున్న రాజమౌళి

Published on Apr 20, 2014 3:32 AM IST

Rajamouli-is-in-awe-of-Raji
ఈరోజు విక్రమసింహా కర్టైన్ రైజర్ వేడుకలో రజినికాంత్ ని కలిసిన రాజమౌళి పరమానందంలో వున్నాడు. విక్రమసింహా రజిని జీవితంలో ఒక సినిమాగా కాకుండా ఒక మైలురాయిగా నిలుస్తుందఐ తెలిపాడు

ఈ ఈవెంట్ ప్రారంభానికి ప్రత్యేక అతిధిగా వచ్చిన రాజమౌళిని చూసి ‘నాకు ఒకసారి బాహుబలి సెట్స్ కి వచ్చి నువ్వు చేసే షూటింగ్ చూడాలని వుంది అని చెప్పారట.’ ఈ సంఘటన నా జీవితంలో మరువలేనిది అని, దానికి నేను ఏం మాట్లాడాలో తెలియక “థాంక్ యు సార్” అన్నట్టు చెప్పానని ట్విట్టర్ లో తెలిపాడు

కొంతకాలం క్రితం రాజమౌళి, రజిని కలిసి ఒక సినిమాలో నటిస్తారని వార్తలోచ్చినా అవి కేవలం పుకార్లే అని తేలాయి. రజిని సినిమాలో గ్రాఫిక్స్ కష్టాలను రాజమౌళి కొనియాడాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు