రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించిన మహేష్, రాజమౌళి !
Published on Apr 7, 2018 10:44 am IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ బ్రహ్మాండమైన వసూళ్లతో బాక్సాఫీస్ హిట్ దిశగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం, రామ్ చరణ్ నటనపై ప్రేక్షకులు, అభిమానులు, సినీ విమర్శకులు, సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించగా ఇప్పడు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కూడ రంగస్థలాన్ని వీక్షించి తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

సినిమా చాలా ఇంటెన్స్ గా ఉందన్న మహేష్ సుకుమార్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్ అని రామ్ చరణ్, సమంతల కెరీర్లో ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్ గా నలిస్తుందని, మైత్రి మూవీస్ మరోసారి మంచి చిత్రాన్ని నిర్మించారని అనగా రాజమౌళి చిట్టిబాబు పాత్రను సుకుమార్ రాసిన, తెరపై ఆవిష్కరించిన తీరు బాగుందని, చరణ్ నటన చూసేందుకు ఒక ట్రీట్ లా ఉందని పొగిడేశారు.

 
Like us on Facebook