శంకర్, కృష్ణవంశీలను ప్రశంశించిన రాజమౌళి

శంకర్, కృష్ణవంశీలను ప్రశంశించిన రాజమౌళి

Published on Sep 16, 2014 4:52 PM IST

SS-RAJAMOULI
సెప్టెంబర్ 15న రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కి సంబందించిన ఆడియో వేడుకలు జరిగాయి. అవే శంకర్ – విక్రమ్ ల ‘ఐ’ మరియు రామ్ చరణ్ – కృష్ణవంశీల ‘గోవిందుడు అందరివాడెలే’. ‘ఐ’ సినిమాపై ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ఉంటే, ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాపై టాలీవుడ్ లో క్రేజ్ ఉంది. ఈ రెండు సినిమాలకి సంబందించిన ట్రైలర్స్ కి అందరి నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అందరితో పాటు ఎస్ఎస్ రాజమౌళి కూడా ఇరు దర్శకులపై ప్రశంశలు కురిపించాడు.

శంకర్ ‘ఐ’ ట్రైలర్ చూసి షాక్ కి గురైన రాజమౌళి ‘ ‘ఐ’ ఫస్ట్ ట్రైలర్ సింప్లీ మైండ్ బ్లోయింగ్.. ఈ గ్రాండ్ నెస్ మరియు విజువల్స్ దరిదాపుల్లోకి ఎవరూ వెళ్లలేరని’ ట్వీట్ చేసాడు.

‘ఐ’ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

tweet2

కృష్ణవంశీ ‘గోవిందుడు అందరివాడేలే’ ట్రైలర్ చూసిన రజమొఇలి కృష్ణవంశీ ఇస్ బ్యాక్ అన్నాడు. ‘ గోవిందుడు అందరివాడేలే ట్రైలర్ చూస్తుంటే కృష్ణవంశీ గారు బ్యాక్ వచ్చినట్టు అనిపిస్తోంది. ట్రైలర్ కొత్తగా మనసుకు హత్తుకునేలా ఉంది. చరణ్ కి పోనీ టెయిల్ బాగా సెట్ అయ్యిందని’ రాజమౌళి ట్వీట్ చేసాడు.

‘గోవిందుడు అందరివాడెలే’ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

tweet1

సంబంధిత సమాచారం

తాజా వార్తలు