ఆర్ ఆర్ ఆర్ అసలు కథ చెప్పేసిన రాజమౌళి

ఆర్ ఆర్ ఆర్ అసలు కథ చెప్పేసిన రాజమౌళి

Published on Mar 29, 2020 6:31 PM IST

ఆర్ ఆర్ ఆర్ మూవీ కథ ఫిక్షనల్ స్టోరీ అని రాజమౌళి మొదటినుండి చెవుతున్నప్పటికీ ఆ సినిమాపై ప్రేక్షకులలో ఉన్న అనుమానాలెన్నో. రెండు ప్రాంతాలు, భిన్న నేపధ్యాలు కలిగిన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులను ఎలా కలిపాడు అనేది అన్నింటికంటే ఆసక్తికర అంశం. ఇదే విషయంపై ఇంటర్వ్యూ లో ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ రాజమౌళిని అడుగగా ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు.

నిజానికి చరిత్రలో కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిసింది లేదు. ఐతే వీరిద్దరి జీవితానికి చాల పోలికలు ఉన్నాయి. ఇరవయ్యేళ్ళ ప్రాయంలో వీరిద్దరూ ఇంటి నుండి పారిపోయారు. తిరిగి వచ్చిన తరువాత ఉద్యమం సాగించారు. వీరి జీవితాలలో జరిగిన సారూప్యతలు తీసుకొని ఫిక్షన్ జోడించి ఈ మూవీని తీయడం జరిగింది. 1920 లో ఇద్దరు మిత్రులు చెడుపై సాగించిన యుద్ధమే ఆర్ ఆర్ ఆర్ కథ అని అసలు విషయం బయటపెట్టారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు