వర్చువల్ రియాలిటీ మ్యాజిక్‌కు కష్టపడుతోన్న రాజమౌళి!

వర్చువల్ రియాలిటీ మ్యాజిక్‌కు కష్టపడుతోన్న రాజమౌళి!

Published on Oct 3, 2016 10:37 AM IST

rajamouli
ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన ‘బాహుబలి’కి రెండో భాగమైన ‘బాహుబలి 2’ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి మొదటి భాగానికి ఎన్నో రెట్లు మించేలా రెండో భాగం ఉండేలా సినిమా కోసం కష్టపడుతూ వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇండియన్ సినిమా చరిత్రలోనే ప్రమోషన్స్ విషయంలో ఎవ్వరూ చేయని ప్రమోషన్స్ బాహుబలి 2కి చేయనున్నారు. ఈ క్రమంలోనే వర్చువల్ రియాలిటీలో మేకింగ్ వీడియోను విడుదల చేయనున్నట్లు రాజమౌళి కొద్దిరోజుల క్రితమే ప్రకటించారు. ఇక తాజాగా ఇదే విషయం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

బాహుబలి కోసం రాజమౌళి టీమ్ నిర్మించిన మాహిష్మతి సామ్రాజ్యాన్ని వర్చువల్ రియాలిటీలో తెరకెక్కించేందుకు ప్రత్యేక కెమెరాలను వాడుతున్నామని, అక్టోబర్ 22న మొదటి వర్చువల్ రియాలిటీ వీడియో విడుదల కానుందని అన్నారు. వర్చువల్ రియాలిటీ అన్న టెక్నాలజీతో బాహుబలి సెట్స్‌లో ఉన్నట్లుగా ఫీలవుతూ విజువల్స్ చూసే అవకాశం ఉంటుంది. కేవలం ఈ వర్చువల్ రియాలిటీ ప్రమోషన్స్ కోసమే రాజమౌళి టీం 25 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఫస్ట్ టైమ్ వర్చువల్ రియాలిటీ కోసం పనిచేయడం చాలా సంతోషంగా ఉందని, ప్రేక్షకులకు ఇదొక కొత్త అనుభూతినిస్తుందని రాజమౌళి ఈ సందర్భంగా అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు