“RRR” విషయంలో రాజమౌళి ఈ ఆలోచనలో ఉన్నారా.?

“RRR” విషయంలో రాజమౌళి ఈ ఆలోచనలో ఉన్నారా.?

Published on Sep 29, 2020 9:00 AM IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ “రౌద్రం రణం రుధిరం” తిరిగి షూట్ ను పునః ప్రారంభం గావించుకోనుంది. అయితే ఈ భారీ బడ్జెట్ పీరియాడిక్ వండర్ ఇప్పటికే చాలా మేర షూట్ ను ఫినిష్ చేసుకోగా అందుకు సంబంధించిన గ్రాఫికల్ వర్క్ ను రాజమౌళి ఫినిష్ చేస్తున్నారు.

ఇక ఈ షూట్ ను ఎలాగో మొదలు పెట్టనుండగా రాజమౌళి ఈ చిత్రం ఎప్పుడు విడుదల చెయ్యాలో అన్న విషయంలో ఆలోచిస్తున్నట్టు టాక్. మొదటగా రాజమౌళి ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసినప్పుడే 2020 జూలై 30వ తారీఖున అని క్లారిటీ ఇచ్చారు. కానీ తర్వాత అది కాస్తా పోస్ట్ పోన్ అయ్యింది. ఆ తర్వాత 2021 సంక్రాంతి రేస్ లో నిలుపుతామని చెప్పారు కానీ కరోనా దెబ్బేసింది.

ఇక దీనితో రాజమౌళి మొదట తాను అనుకున్న ముహుర్తానికే మళ్ళీ ఫిక్స్ అయ్యినట్టు ఓ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. 2020 జూలై 30 కి ప్లాన్ చేసిన ఈ చిత్రాన్ని అదే తేదీన 2021కి అనుకుంటున్నారని ఇపుడు లేటెస్ట్ టాక్. మరి అప్పటికి కనుక పరిస్థితులు చక్కబడితే ఖచ్చితంగా రాజమౌళి అప్పుడు మిస్సయిన డేట్ ను ఈసారి కంప్లీట్ చేస్తారని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు