ఎట్టకేలకు స్పందించిన సూపర్ స్టార్ రజనీకాంత్ !


గత నాలుగు రోజులుగా తమిళ పరిశ్రమలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి విధిస్తున్న 48, 58 శాతం పన్నుల భారం భరించడం కష్టమని థియేటర్, నిర్మాతల మండలిలు గత మూడు రోజులుగా 1100 లకు పైగా స్క్రీన్లను మూసివేసి నిరసన తెలుపుతున్నారు. దీని పట్ల కమల్ హాసన్ తో పాటు పలువురు తమిళ స్టార్ హీరోలు, ప్రముఖులు స్పందించగా సూపర్ స్టార్ రజనీ కూడా స్పందించాలని డిమాండ్ ఎక్కువైంది.

నిర్మాత, నటుడు టి.రాజేందర్ అయితే రజనీ రాజకీయాల్లోకి రాబోతున్నారు కాబట్టి తప్పక స్పందించాలని, తన మద్దత్తు ఎవరి వైపో స్పష్టం చేయాలని ప్రెస్ మీట్ పెట్టి మరీ అడిగారు. దీంతో రాజకీయపరంగా ఈ వ్యవహారం ప్రాముఖ్యత సంతరించుకుంది. అలా అంతా రజనీ అభిప్రాయం ఎలా ఉంటుందో చూడాలని ఆతురతగా ఎదురుచూస్తున్న తరుణంలో ‘తమిళ పరిశ్రమలో ఉన్న లక్షలాది మంది జీవితాల్ని దృష్టిలో పెట్టుకుని తమిళనాడు ప్రభుత్వం తమ డిమాండ్ ను ఆమోదించాలి’ అంటూ రజనీ పరిశ్రమ పట్ల తన మద్దత్తు తెలియజేశారు.

 

Like us on Facebook