రజనీ ఇకపై సినిమాలు చేయరా ?
Published on Jan 16, 2018 8:59 am IST

సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవలే తన రాజకీయ రంగ ప్రవేశాన్ని అధికారికంగా ప్రకటించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పార్టీ అంతర్గత నిర్మాణ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. ఒకవైపు ఆయన రాజకీయాల్లోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు ఇకపై ఆయన సినిమాలు చేస్తారో లేదో అనే ఆందోళనలో కూడా ఉన్నారు.

తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం సూపర్ స్టార్ ప్రస్తుతం చేస్తున్న ‘కాల’ పూర్తికాగానే సినిమాల్లోంచి తప్పుకుంటారని, అదే అయన చేసే చివరి చిత్రం కావోచ్చని తెలుస్తోంది. ఇప్పటికే మొదటి విడత సభ్యత నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆయన త్వరలోనే పార్టీ పేరును, సభ్యుల్ని ప్రకటించి తమిళనాడు పర్యటనకు బయలురుతారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత మేరకు వాస్తవముందో తేలాలంటే రజనీ నుండి ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలి.

 
Like us on Facebook