కమల్ కు ఆల్ ది బెస్ట్ చెప్పిన రజనీ !

కమల్ కు ఆల్ ది బెస్ట్ చెప్పిన రజనీ !

Published on Jan 17, 2018 9:38 PM IST


విశ్వనటుడు కమల్ హాసన్ ఫిబ్రవరి 21న తన స్వస్థలం రామంతపురం నుండి టూర్ ను మొదలుపెట్టి పార్టీ పేరును, విధి విధానాలను ప్రకటిస్తానని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా కమల్ అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండటాన్ని కొందరు హర్షిస్తే ఇంకొందరు విమర్శించారు. కమల్ సహచరుడు, మిత్రుడు సూపర్ స్టార్ రాజనీకాంత్ అయితే తనదైన శైలిలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

కమల్ కు ఇకముందు విజయం చేకూరాలని ఆశించారు. కమల్ కూడా గతంలో రజనీ పొలిటికల్ ఎంట్రీపై అధికారిక ప్రకటన చేయగానే హర్షించి, శుభాకాంక్షలు తెలిపారు. ఇలా ఇద్దరు స్టార్ హీరోలు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నా మైత్రిని మర్చిపోకుండా అన్నిటికీ అతీతంగా స్నేహా భావంతో మెలుగుతుండటంతో ఇరువురి అభిమానుల్లోనూ ఒకరకమైన సంతృప్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు