‘లింగా’ క్లైమాక్స్ కంప్లీట్ చేసిన రజినీకాంత్.

‘లింగా’ క్లైమాక్స్ కంప్లీట్ చేసిన రజినీకాంత్.

Published on Sep 23, 2014 4:42 PM IST

lingaa
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా సినిమా ‘లింగా’. సెప్టెంబర్ 23, నేటితో ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తవుతుంది. గత కొన్ని రోజులుగా కర్ణాటకలో షిమోఘ ఏరియాలో లింగనమక్కి డాం వద్ద క్లైమాక్స్ సన్నివేశాలను షూట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

‘ రజినీకాంత్ ‘లింగా’ సినిమా క్లైమాక్స్ లో భారి స్టంట్ సీక్వెన్స్ షూటింగ్ ఈ రోజుతో పూర్తవుతుంది. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు & టీంను మిస్ అవుతున్నాను ‘ అని యాక్షన్ సన్నివేశాల దర్శకుడు లీ ట్విట్ చేశారు.

క్లైమాక్స్ సన్నివేశాల షూటింగ్ పూర్తవడంతో ‘లింగా’ మూవీ యూనిట్ త్వరలో యూరోప్ పయనం అవుతారు. అక్కడ అందమైన లొకేషన్ లలో పాటలను చిత్రీకరిస్తారు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ఎఅర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత. రజిని బర్త్ డే కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేస్తున్నారు.
leewhittaker-twitt

సంబంధిత సమాచారం

తాజా వార్తలు