రజనీకాంత్ కూడా రెడీ కానున్నాడు !

రజనీకాంత్ కూడా రెడీ కానున్నాడు !

Published on Dec 5, 2020 9:00 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో చేస్తున్న తన 168వ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా.. అసలు ఈ ఏడాది షూటింగ్ స్టార్ట్ చేస్తారా.. లేదా.. అని రజిని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ సినిమా షూటింగ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. జనవరి మూడోవారం నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే మొన్నటి వరకూ రజిని వయసు రిత్యా షూటింగ్ ఇప్పట్లో చేయకపోతేనే బెటర్ అనే ఫిలింగ్ లో మేకర్స్ ఉన్నారని వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా రజిని మీద సోలో సీన్స్ ను జనవరి నుండి తీస్తారని తెలుస్తోంది. ఈ సీన్స్ వెరీ ఇంట్రస్టింగ్ గా ఉంటాయట. ఆ తరువాత రజిని – ఖుష్బూ కలయికలో వచ్చే ఫ్యామిలీ సీన్స్ తీస్తారని తెలుస్తోంది. కాగా ఖుష్బూ ఈ సినిమా కోసం బరువు తగ్గి సరికొత్తగా రెడీ అయింది. రజనీ – ఖుష్బూలది హిట్ కాంబినేషన్.

గతంలో రజనీ, ఖుష్బూలు కలిసి ‘అన్నామలై, మన్నన్, పాండియన్, నట్టుక్కు ఓరు నల్లవన్’ వంటి సినిమాల్లో కలిసి చేశారు. మళ్లీ చాలా సంవత్సరాలు తరువాత ఇప్పుడు కలిసి నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు