అమాయకుల మరణానికి ప్రభుత్వానిదే భాద్యత – రజనీకాంత్

అమాయకుల మరణానికి ప్రభుత్వానిదే భాద్యత – రజనీకాంత్

Published on May 23, 2018 3:01 PM IST

తమిళనాడులోని ట్యుటికోరిన్ లో స్టెరిలైట్ రాగి కర్మాగారానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన హింసాత్మకంగా మారింది. నిన్న సుమారు 20 వేల మంది నిరసనకారులు కర్మాగారాన్ని మూసివేయాలంటూ ట్యుటికోరిన్ కలెక్టరేట్ ను ముట్ఠడించారు. ఈ సందర్బంగా పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ తలెత్తింది. నిరసనకారులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది మరణించగా అనేక మంది గాయాలపాలయ్యారు.

ఈ ఘటనను అన్ని రాజకీయ పార్టీలతో పాటు సినీ తారలు సైతం తీవ్ర స్థాయిలో ఖండించగా ఈరోజు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడ ఈ ఘటనపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ప్రజల మనోభావాల పట్ల ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించకపోవడంతో అమాయకులు కాల్పులకు గురై ప్రాణాలు వదిలారు. దీనికి ప్రభుత్వానిదే భాద్యత. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, వైఫల్యాన్ని, క్రూరత్వాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధిత కుటుంబాలకు నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను’ అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు