‘దర్బార్’ రిలీజ్ డేట్ కన్ఫర్మ్.. ముందే వస్తోంది

‘దర్బార్’ రిలీజ్ డేట్ కన్ఫర్మ్.. ముందే వస్తోంది

Published on Nov 19, 2019 12:47 PM IST

వచ్చే యేడాది సంక్రాంతికి పెద్ద సినిమాలు ‘అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు బరిలో ఉన్న సంగతి తెలిసిందే. జనవరి 12న ఈ రెండూ విడుదలకానున్నాయి. దీంతో జనవరి 15న విడుదలకావాల్సిన ‘దర్బార్’ను వేరొక తేదీకి మార్చాలనే ఆలోచనలో పడ్డారు నిర్మాతలు. ముందుగా జనవరి 10న విడుదలచేస్తే బాగుంటుందని అనుకున్నారు.

కానీ దాన్ని కూడా ఇంకాస్త ముందుకు జరిపి జనవరి 9న విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తన అధికారిక వెబ్ సైట్లో ప్రకటించింది. ఇలా 9వ తేదీన వస్తుండటంతో చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో థియేటర్లు దొరికి 9, 10, 11 మూడు రోజులు సోలో కలెక్షన్లు లభించనున్నాయి.

మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రజనీకి జోడీగా నయనతార కథానాయకిగా నటిస్తోంది. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నారు. మరొక నటి నివేత థామస్ సైతం ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు