రజినీకాంత్ సినిమాకు క్లీన్ ‘యు’ సర్టిఫికేట్

రజినీకాంత్ సినిమాకు క్లీన్ ‘యు’ సర్టిఫికేట్

Published on Nov 26, 2014 1:03 PM IST

lingaa-sencor
కేయస్ రవికుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా సినిమా ‘లింగ’ సెన్సార్ కార్యక్రమాలు మంగళవారం పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చారు. రజినీకాంత్ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 12న ‘లింగ’ విడుదల కానుంది. సెన్సార్ పూర్తికావడంతో నిర్మాతలు ప్రమోషనల్ కార్యక్రమాల మీద దృష్టి సారించారు.

రజినీకాంత్ సరసన అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటించారు. జగపతి బాబు విలన్ గా నటించారు. ఏఅర్ రెహమాన్ సంగీత దర్శకుడు. రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి. పతాకంపై కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మించారు. ఈరోస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ‘లింగ’ సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఈ సినిమాను భారి ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు