రజనీ సినిమా విడుదల వాయిదాపడుతుందా ?

రజనీ సినిమా విడుదల వాయిదాపడుతుందా ?

Published on Mar 21, 2018 3:52 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం ‘కాలా’. అనేక తర్జన భర్జనల తర్వాత ఈ సినిమాను ఏప్రిల్ 27న విడుదలచేయాలని నిర్ణయించారు. కానీ ప్రసుతం తమిళ చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ఈ చిత్ర విడుదల వాయిదాపడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే మార్చి 16 నుండి నడుస్తున్న బంద్ మూలంగా సెన్సార్ పనులు ముగించుకుని ఈ మార్చి నెలలో విడుదలకావల్సిన చిన్న సినిమాలు చాలానే వాయిదాపడ్డాయి.

నిర్మాతలు మండలి ప్రణాళిక ప్రకారం నిరసన ముగిశాక ముందుగా సెన్సార్ పనులని పూర్తిచేసుకున్న సినిమాల్ని విడుదలచేస్తామని మండలి సెక్రటరీ దురైరాజ్ తెలిపారట. అంతేగాక ‘కాలా’ లాంటి పెద్ద సినిమాలు ఎప్పుడు విడుదలైనా పర్వాలేదని, వాటి బిజినెస్ వాటికి ఉంటుందని, చిత్ర టీమ్ కూడ తమకు సహకరించి తాము ఎప్పుడు చెబితే అప్పుడే సినిమాను విడుదలచేయడానికి సిద్ధంగా ఉన్నారని, ఈ నిరసన పరిశ్రమకు మంచి చేయడానికేనని అన్నారట.

ఆయన మాటల ప్రకారం ముందుగా సెన్సార్ పనుల్ని ముగించుకున్న ఇతర సినిమాలు విడుదలవ్వాలి కాబట్టి వాటి కోసమైనా ‘కాలా’ వాయిదాపడే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై సినిమాను రిలీజ్ బాధ్యతలని తీసుకున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు