పొలిటికల్ కంటెంట్ తో సినిమా చేయాలనుకుంటున్న రజనీ ?
Published on Jan 7, 2018 9:44 pm IST

సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయాల్లోకి దిగగానే ఆయన మీద, ఆయా కార్యా చరణల మీద ప్రజలు, రాజకీయ నాయకుల దృష్టి రెట్టింపైంది. ఆయన తదుపరి చర్యలేమిటో తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ముఖ్యంగా అభిమానులైతే రజనీ ఇకపై సినిమాలు చేస్తారా చేయరో అనే డైలమాలో పడిపోయారు.

వాళ్లకు కొంత ఊరటనిచ్చే వార్త ఇప్పుడు బయటికొచ్చింది. అదేమిటంటే రజనీ ప్రస్తుతం చేస్తున్న ‘రోబో 2, కాల’ పనులు పూర్తవగానే నెక్స్ట్ సినిమాను పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో ఉండేలా చూసుకుంటున్నారట. అందుకోసం బలమైన కథను, అలాంటి సినిమాను హ్యాండిల్ చేయగల దర్శకుడిని వెతికే పనిలో ఉన్నారట. మరి రజనీ చేయాలనుకుంటున్న ఆ సినిమా ఎలా ఉండబోతోందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

 
Like us on Facebook