‘కబాలి’ రిలీజ్ డేట్ మార్చమన్న రజినీకాంత్

‘కబాలి’ రిలీజ్ డేట్ మార్చమన్న రజినీకాంత్

Published on Feb 13, 2016 9:31 AM IST

kabali1
సూపర్ స్టార్ రజినీకాంత్ తన రియల్ లైఫ్ వయసులో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో చేస్తున్న సినిమా ‘కబాలి’. మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఫైనల్ షెడ్యూల్ ప్రస్తుతం మలేషియాలో జరుగుతోంది. ఈ నెల 20 కల్లా షూటింగ్ పూర్తికానున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమాని తమిళ న్యూ ఇయర్ రోజున అనగా ఏప్రిల్ 14న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న రజినీకాంత్ నిర్మాత అయిన కలైపులి ఎస్ థానుకి సినిమా రిలీజ్ ని వాయిదా వేయమని గట్టిగా చెప్పాడు. దానికి కారణం ఏప్రిల్ లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడమే. అందుకే రజినీకాంత్ ఎన్నికల తేదీ విడుదలయ్యాక, దాన్ని బట్టి రిలీజ్ డేట్ ని ఏప్రిల్ చివర్లో లేదా మే లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్కోమని రజినీకాంత్ సూచించాడట. రజినీకాంత్ ఎన్నికల సమయంలో ఎలాంటి ఇన్వాల్ మెంట్ ఇవ్వకూడదనే ఇలా న్యూట్రల్ అవుతున్నాడట. పిఎ రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాధిక ఆప్టే రాజినికంత్ కి జోడీగా కనిపించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు