చివరి దశలో రజినీ ‘కబాలి’

చివరి దశలో రజినీ ‘కబాలి’

Published on Nov 24, 2015 8:24 AM IST

kabali
‘లింగ’ లాంటి డిజాస్టర్ తర్వాత సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ యంగ్ డైరెక్టర్ అయినప్పటికీ పిఎ రంజిత్ చెప్పిన కథ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమా ‘కబాలి’. ఒకప్పటి సౌత్ చెన్నై రియల్ లైఫ్ డాన్ కబాలీశ్వరన్ కథని ఆధారంగా చేసుకొని తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మొదటి షెడ్యూల్ లో భాగంగా చెన్నైలో ఓ మేజర్ ఎపిసోడ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం గత 30 రోజులుగా మలేషియాలో షూటింగ్ చేస్తోంది. రీసెంట్ గా మలేషియా షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. దీంతో దాఆపు 90% షూటింగ్ పూర్తయ్యింది.

మలేషియా షెడ్యూల్ పూర్తి చేసుకొని చెన్నై చేరుకున్న ఈ చిత్ర టీం డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఫైనల్ షెడ్యూల్ ని మొదలు పెట్టనున్నారు. దాంతో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఇంటర్నెట్ లో లీక్ అవుతున్నరజినీకాంత్ స్టిల్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేస్తున్నాయి. ఈ సినిమా తెలుగు వెర్షన్ కి ‘మహదేవ్’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. రజినీకాంత్ సరసన రాధిక ఆప్టేని హీరోయిన్ గా ఫైనలైజ్ చేసిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జెడి చక్రవర్తి, ధన్సిక ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు