సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందో రివీల్ చేసిన రకుల్ !

సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందో రివీల్ చేసిన రకుల్ !

Published on Jul 23, 2017 6:45 PM IST


ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో హీరోయిన్ పాత్రకుగాను మంచి గుర్తింపు లభించేలా రూపొందిన చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. ఈ సినిమాలో భ్రమరాంభగా నటించిన రకుల్ ప్రీత్ కు విమర్శకులు, ప్రేక్షకుల ప్రసంశలు అందాయి. దీంతో ఆమె స్టార్ స్టేటస్ ఇంకాస్త పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమె చేస్తున్న పెద్ద ప్రాజెక్టుల్లో ‘జయ జానకి నాయక’ కూడా ఒకటి.

ఇందులో కూడా తన క్యారెక్టర్ బలంగానే ఉంటుందని రకుల్ స్వయంగా మీడియాకు తెలిపారు. ఇందులో తన పాత్ర కొంచెం సంప్రదాయబద్దంగాను, ఇంకొంచెం మోడరన్ గాను ఉంటుందని, కథలో వచ్చే బలమైన్ ట్విస్ట్ తో పాత్ర తీరు పూర్తిగా మారిపోతుందని అన్నారు. అంతేగాక ఈ సినిమాలో ఎమోషనల్ లవ్ ట్రాక్ ఉంటుందని కూడా తెలిపారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం ఆగష్టు 11న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు