భారీ ప్రాజెక్టులో రకుల్ ప్రీత్ సింగ్ !

భారీ ప్రాజెక్టులో రకుల్ ప్రీత్ సింగ్ !

Published on Feb 17, 2018 4:00 PM IST

తమిళ పరిశ్రమలో మంచి సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్న హీరో శివ కార్తికేయన్. ఈ హీరో త్వరలో రవికుమార్ తో ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ ను చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాపై తమిళ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ ఫైనల్ అయ్యిందని తెలుస్తోంది.

రవి కుమార్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో రకుల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం బాలీవుడ్లో అజయ్ దేవగన్ తో సినిమా చేస్తున్న ఈమె తమిళంలో సూర్య, కార్తీలతో ఒక్కో సినిమా చేయనుంది. దీంతో మొత్తం నాలుగు పెద్ద సినిమాలు ఈమె చేతిలో ఉన్నాయి. అయితే తెలుగులో రకుల్ చివరి చిత్రం ‘స్పైడర్’ విడుదలై చాలా రోజులవుతునా ఇంకా ఈమె కొత్త ప్రాజెక్టుకి కమిటవ్వకపోవడం గమనార్హం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు