మరో స్టార్ హీరో కోసం రకుల్ ప్రీత్ !


తెలుగు పరిశ్రమలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమిళ ఇండస్ట్రీపై కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే కార్తి చిత్రంలో నటించనున్న ఆమె త్వరలోనే అతని సోదరుడు సూర్య చిత్రంలో కూడా నటించే అవకాశముంది. ప్రస్తుతం విజ్ఞేశ్ శివన్ దర్శకత్వంలో నటిస్తున్న సూర్య అది పూర్తవగానే సెల్వ రాఘవన్ డైరెక్షన్లో ఒక సినిమా చేయనున్నాడు.

ఈ చిత్రంలో సూర్యకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకోవాలనే ఆలోచనతో ఆమెను సంప్రదించారట దర్శక నిర్మాతలు. రకుల్ కూడా కథ విని ప్రాజెక్ట్ పట్ల సుముఖంగానే ఉన్నారని, ఆఖరి దశ చర్చలు జరుగుతున్నాయని, ఆమె ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. డ్రీమ్ వారియర్స్ పాతకంపై ఎస్సార్ ప్రభు, ఎస్సార్ ప్రకాష్ బాబులు నిర్మించనున్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ ఏప్రిల్ ఆఖరు నుండి మొదలై చెన్నై, ముంబై, హైదరాబాద్లలో జరగనుంది.

 

Like us on Facebook