మహేష్ సినిమా షూటింగ్ లో గాయపడ్డ రకుల్ ప్రీత్ సింగ్ !

మహేష్ సినిమా షూటింగ్ లో గాయపడ్డ రకుల్ ప్రీత్ సింగ్ !

Published on Oct 22, 2016 9:38 AM IST

rakul

సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ డైరెక్షన్లో చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం యొక్క షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న జరిగిన ఈ చిత్రం యొక్క షూటింగ్లో రకుల్ ప్రీత్ గాయపడింది. మురుగదాస్ మహేష్, రకుల్ ప్రీత్ లపై ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా చిన్నపాటి ప్రమాదం జరిగి రకుల్ ఎడమ చేతి వేళ్ళకు గాయమైందట.

దీంతో ఆమెను వెంట ప్రయివేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లగా అక్కడి డాక్టర్లు ఆమెకు అన్ని రకాల పరీక్షలు చేసి పెద్ద ప్రమాదమేమీ లేదని, రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే చాలని చెప్పి రకుల్ చేతికి బ్యాండేజ్ వేసి పంపారట. ఆ తరువాత కాసేపటికే డైరెక్టర్ షాట్ రెడీ అనగానే రకుల్ చేతికున్న బ్యాండేజ్ ను తీసివేసి చకచకా కెమెరా ముందుకు వెళ్లిపోయిందట. కుల్ ప్రీత్ డెడికేషన్ చూసి సెట్లోని కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అందరూ ముచ్ఛటపడిపోయారట. ప్రస్తుతం రకుల్ చరణ్ సరసన ‘ధృవ’, ధరమ్ తేజ్ సరసన ‘విన్నర్’ సినిమాల్లో నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు