ఎనిమీస్ కామెంట్స్ పై రకుల్ ప్రీత్ కౌంటర్ అటాక్

ఎనిమీస్ కామెంట్స్ పై రకుల్ ప్రీత్ కౌంటర్ అటాక్

Published on Apr 21, 2015 5:13 PM IST

Rakul-Preet_Singh
ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ గా దూసుకుపోతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటికే వరుస హిట్స్ అందుకున్న ఈ భామ ఇప్పటికే కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కి సంబందించిన షూటింగ్ ఫినిష్ చేయగా మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నాయి. సినిమా ఇండస్ట్రీలో మనల్ని మెచ్చుకునే వాళ్ళు ఎంత మంది ఉంటారో అంతకంటే ఎక్కువ మందే మన చెడుని కోరుకునే వారు ఉంటారు. ఇదే కోవలోనే రకుల్ ప్రీత్ సింగ్ అంటే గిట్టనివారు కూడా చాలా మందే ఉన్నారు. అలాంటి వారు ఈ భామ పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

అందులో ముఖ్యంగా రకుల్ ప్రీత్ క్రేజ్ చూసి ఓర్వలేనివారు కేవలం లక్ వల్లే రకుల్ ప్రీత్ ఈ ప్లేస్ లో ఉందే తప్ప మరేమీ కాదని అంటున్నారు. ఇలా అన్న ప్రతి ఒక్క చెంప చెల్లుమనేలా రకుల్ ప్రీత్ సమాధానం ఇచ్చింది. ‘కేవలం లక్ ఒక్కటే కాదు నేను చేసిన హార్డ్ వర్క్, నేను చూపిన డెడికేషన్ ఏ ఈ రోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. నేను సినిమాల్లో అవకాశం కోసం 6 సంవత్సరాలు వెయిట్ చేసాను. వచ్చిన అవకాశాన్ని మిస్ అవ్వకుండా ఎంతో హార్డ్ వర్క్ చేసి నా టాలెంట్ నిరూపించుకున్నానని’ రకుల్ ప్రీత్ తెలిపింది.

రాకుల్ ప్రీత్ ఇప్పటికే పండగ చేస్కో సినిమా షూటింగ్ ఫినిష్ చేసింది, కిక్ 2 షూటింగ్ చివరి దశలో ఉంది. ఇది కాకుండా రామ్ చరణ్, ఎన్.టి.ఆర్, మహేష్ బాబు సినిమాల షూటింగ్ ను త్వరలో మొదలు పెట్టనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు