టాలీవుడ్ పరంగా హ్యాపీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్ పరంగా హ్యాపీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్

Published on Oct 21, 2014 1:19 PM IST

Rakul-Preet-Singh2
యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘లౌక్యం’ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న రాకుల్ ప్రీత్ సింగ్ నటించిన మూడవ సినిమా ‘కరెంట్ తీగ’ అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. ఇది కాకుండా ‘రఫ్’,
‘పండగ చేస్కో’, ‘కిక్ 2′ సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి.

కరెంట్ తీగ సినిమా కూడా మంచి విజయం సాధించి తనకి హ్యాట్రిక్ హిట్ అందిస్తుందని రాకుల్ ప్రీత్ ఎంతో నమ్మకంగా ఉంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో పని చేయడం చాలా హ్యాపీగా ఉందని మరియు ఇక్కడ గ్రేట్ ప్రొఫెషనలిజం ఉందని అంటోంది. ‘నేను ఎప్పుడైతే తెలుగు ఫిల్మ్స్ చేయాలనుకున్నానో అప్పుడే చాలా మంది టాలీవుడ్ ప్రొఫెషనల్ గా ఉండదని, వద్దని అన్నారు. కానీ టాలీవుడ్ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంతే కాకుండా గ్రేట్ ప్రొఫెషనలిజం తెలుగు ఇండస్ట్రీలో ఉందని’ రాకుల్ ప్రీత్ తెలిపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు