షూటింగ్ మొదలుపెట్టనున్న రకుల్ ప్రీత్ !

షూటింగ్ మొదలుపెట్టనున్న రకుల్ ప్రీత్ !

Published on Apr 21, 2018 9:46 AM IST

స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తన 36వ సినిమా ‘ ఎన్.జి.కే’ ను ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత వరకు జరిగిన ఈ సినిమా షూటింగ్ నిర్మాతల మండలి నిరసన వలన ఇన్నాళ్లు ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు నిరసన ముగియడంతో తిరిగి మొదలుకానుంది షూటింగ్. ఈరోజే కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు చిత్ర యూనిట్.

అంతేగాక చిత్ర హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సైతం ఈరోజే తొలిసారి సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు సాయి పల్లవి కూడ నటిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీం వారియర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభులు నిర్మిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు