మనసులో మాటను బయటపెట్టిన హీరో రామ్ !

మనసులో మాటను బయటపెట్టిన హీరో రామ్ !

Published on Oct 24, 2017 3:32 PM IST


యంగ్ హీరో రామ్ చేసిన తాజా చిత్రం ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ ఈ నెల 27న అనగా ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. స్నేహ బంధం నైపథ్యంలో రూపొందిన సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పాజిటివ్ క్రేజ్ నెలకొంది ఉంది. ఈ చిత్రంపై ఖచ్చితంగా విజయం అందుకుంటాననే ధీమాతో ఉన్నాడు రామ్. ఇకపోతే తాజాగా జరిగిన చిత్ర ప్రమోషన్లలో మాట్లాడుతూ తనకు ద్విభాషా చిత్రాలు చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారాయన.

తనకు కూడా వేరే భాషల్లో సినిమాలు చేయాలని, తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాల్ని రిలీజ్ చేయాలని ఉందన్న రామ్ బైలింగ్యువల్ సినిమా అంటే అంత ఈజీ కాదని, దానికి కథ, దర్శకుడు వంటి అన్ని అంశాలు కరెక్టుగా కుదరాలని, అలా కుదిరితే తప్పకుండా చేస్తానని అన్నారు. అంతేగాక గతంలో తాను చేసిన ‘ఎందుకంటే ప్రేమంట’ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా విడివిడిగా రూపొందిందని, మంచి కథలు దొరికితే మల్టీ స్టారర్ చేయడానికి కూడా సిద్ధమని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు