ఎట్టకేలకు రామ్ చరణ్ కల నెరవేరనుంది!

ఎట్టకేలకు రామ్ చరణ్ కల నెరవేరనుంది!

Published on Dec 11, 2016 10:53 AM IST

dhruva
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అభిమానులను అలరించేందుకు గత శుక్రవారం ‘ధృవ’ సినిమాతో థియేటర్ల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరన్సీ బ్యాన్ వల్ల కలెక్షన్స్ ఫర్వాలేదనేలా ఉంటే, యూఎస్‍లో మాత్రం వసూళ్ళ వర్షం కురిపిస్తూ సినిమా దూసుకుపోతోంది. యూఎస్‌లో పెద్ద హీరోలందరూ సునాయాసంగా చేరుకునే 1 మిలియన్ డాలర్ మార్క్‌ను చరణ్ మాత్రం ఇప్పటికీ అందుకోకపోవడంతో, ధృవ అయినా ఆ కల నెరవేరుస్తుందా అని మొదట్నుంచీ పెద్ద ప్రచారం జరుగుతూ వచ్చింది.

ఇక తాజాగా ధృవ రామ్ చరణ్ కెరీర్లో మొదటి 1 మిలియన్ డాలర్‌ సినిమాగా నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంది. శనివారంతో 700కే డాలర్లకు పైనే వసూలు చేసిన సినిమా, ఆదివారం పూర్తయ్యేసరికి 1 మిలియన్ సాధిస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. రామ్ చరణ్ స్వయంగా యూఎస్‌లో ప్రమోషన్స్ చేయడం కూడా బాగా కలిసివచ్చిందనే చెప్పాలి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇంటెలిజెంట్ థ్రిల్లర్‍గా మంచి టాక్‌నే సంపాదించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు