రామ్ చరణ్ కు కథ నచ్చలేదు.

రామ్ చరణ్ కు కథ నచ్చలేదు.

Published on Aug 22, 2014 9:00 PM IST

Ramcharanమెగా హీరోతో మణిరత్నం సినిమా అంటూ కొన్ని రోజుల క్రితం మీడియాలో న్యూస్ ప్రముఖంగా వినిపించింది. చిరంజీవి 150వ సినిమా కోసం మణిరత్నం కథ రెడీ చేశారని కొందరు, రామ్ చరణ్, అల్లు అర్జున్ హీరోలుగా మల్టీస్టారర్ సినిమా రూపొందించడానికి సన్నహాలు చేస్తున్నారు అంటూ మరికొందరు వార్తలు ప్రసారం చేశారు. అయితే మెగా కాంపౌండ్ హీరోలకు మణిరత్నం కథ నచ్చలేదు. ఈ విషయాన్నీ స్వయంగా చిరంజీవి వెల్లడించారు. బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మణిరత్నం సినిమా వర్కౌట్ కాలేదని చెప్పారు.

చరణ్ కోసం మణిరత్నం కథ రెడీ చేశారు. ఎందుకో ఆ కథపై చరణ్ కు నమ్మకం కుదరలేదు. అని చిరంజీవి చెప్పారు. మహేష్ బాబు, నాగార్జున హీరోలుగా ఒక సినిమా తెరకెక్కించడానికి మణిరత్నం ప్రయత్నాలు సాగించారు. అవి కూడా ఓ కొలిక్కి రాలేదు. ఆ సినిమా కూడా స్టార్టింగ్ స్టేజిలోనే ఆగిపోయింది. తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఎన్నో గొప్ప సినిమాలను తీసిన మణిరత్నం గత చిత్రాలు ప్లాప్ అవ్వడంతో కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు