దసరా కు రాబోతున్న రామ్ చరణ్ ’ధృవ’…?

దసరా కు రాబోతున్న రామ్ చరణ్ ’ధృవ’…?

Published on May 6, 2016 4:27 PM IST

ram-charan1
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ బ్లాక్ బస్టర్ హిట్ ’తని ఒరువన్’ చిత్రాన్ని తెలుగులో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే! నిజానికి వేగంగా షూటింగ్ పూర్తిచేసి ఈ చిత్రాన్ని ఆగస్ట్ నెలలో విడుదల చేసేందుకు రామ్ చరణ్ ముందుగా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమాని దసరాకు విడుదల చేయాలనుకున్నట్లు రామ్ చరణ్ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ ని ఈ నెల రెండో వారం నుండి మొదలు పెట్టనున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ పై కొన్ని సన్నివేశాలు తీయాలని ప్లాన్ చేసినా ప్రస్తుతం అందుకు సంబంధించి క్లారిటీ లేదు.

కారణం ఏమిటంటే… ప్రస్తుతం చిరు 150 వ చిత్రాని రామ్ చరణ్ తన కొనిదెల ప్రొడక్షన్ పై ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే రెండు ఒకేసారి షూటింగ్ జరుపుకుంటే అటు ’ధృవ’ లో నటుడిగా ఇటు తనతండ్రి సినిమాకు నిర్మాతగా వ్యవహరించడం కష్టంగా మారడంతో పాటు అవుట్ పుట్ లో తేడా వస్తుందని రామ్ చరణ్ భావించడంతో ప్రస్తుతానికి ’ధృవ’ ని వాయిదా వేయడంతో బాటు ఆగస్ట్ నెలలో విడుదలచేయాలనుకున్న సినిమాని దసరాకు విడుదల ఆయ్యేలా ప్లాన్ చేసినట్టు తెలిసింది. అయితే రెండో షెడ్యూల్ లో రామ్ చరణ్ లేని సన్నివేశాలు తీసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విషయం పై మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ట్రైనీ ఐపీయస్ ఆఫీసర్ గా రామ్ చరణ్ కనిపించనున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు