‘ధృవ IPS’కు బై బై చెప్పేసిన చరణ్!

dhruva
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ధృవ’ సినిమాపై ఏస్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నెలరోజుల క్రితమే విడుదలైన టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్తే, ఈమధ్యే విడుదలైన ఆడియో కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా ఆకట్టుకొని దూసుకుపోతోంది. ఇక వచ్చే నెల 2వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ముందే ప్రకటించిన టీమ్, అందుకు తగ్గట్టే అన్ని కార్యక్రమాలనూ వేగవంతం చేసింది.

ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరిదశకు చేరుకున్నాయి. నేటితో రామ్ చరణ్ తన డబ్బింగ్ పార్ట్ కూడా పూర్తి పూర్తి చేశారు. ధృవ ఐపీఎస్‌గా చివరి రోజు వచ్చేసిందని, డబ్బింగ్ పనులన్నీ పూర్తయ్యాయని, సినిమాను ఎప్పుడెప్పుడు ప్రేక్షకులతో కలిసి థియేటర్లలో చూస్తానా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చరణ్ తెలిపారు. ‘ధృవ’ అనే ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా చరణ్ ఈ సినిమాలో కనిపించనున్నారు. నాటితరం హీరో అరవింద్ స్వామి విలన్‌గా నటించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు.

 

Like us on Facebook