రామ్ చరణ్ మూవీకి ఖరారైన విలన్!!

రామ్ చరణ్ మూవీకి ఖరారైన విలన్!!

Published on Nov 30, 2015 11:01 AM IST

ram-charan-aravind-swami
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దసరా కానుకగా రిలీజ్ చేసిన ‘బ్రూస్ లీ’ సినిమా మెగా అభిమానులను మెప్పించడమే కాకుండా చరణ్ ఖాతాలో మరో 40 కోట్ల మార్క్ సినిమాగా నిలిచింది. ఇటీవలే హాలిడే పూర్తి చేసుకొని వచ్చిన రామ్ చరణ్ తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడు. తమిళ సూపర్ హిట్ మూవీ ‘తని ఒరువన్’ రీమేక్ గా రానున్న చరణ్ నెక్స్ట్ మూవీకి సురేందర్ రెడ్డి డైరెక్టర్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా సాగుతున్న ఈ సినిమాని డిసెంబర్ లో అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఈ సినిమాలో హీరో ఎంత ముఖ్యమో విలన్ రోల్ కూడా అంతే ముఖ్యం. అందుకే గత కొద్ది రోజులుగా రామ్ చరణ్కి పోటీగా నిలిచే విలన్ కి ఎవరు సెట్ అవుతారా అని అన్వేషించారు.

ఫైనల్ గా తమిళంలో విలన్ గా చేసిన అరవింద్ స్వామి అయితేనే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని ఆయన్ని అప్రోచ్ అయ్యి, ఈ రోల్ చేయడం కోసం 5 కోట్ల రూపాయలని కూడా ఆఫర్ చేసారు. గత కొద్ది రోజులుగా ఈ ఆఫర్ ని హోల్డ్ లో పెట్టిన అరవింద్ స్వామి తాజాగా తెలుగు వెర్షన్ లో విలన్ గా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దాంతో చాలా కాలంగా ఈ చిత్ర టెన్షన్ పడుతున్న విలన్ రోల్ మాటర్ ఫినిష్ అయ్యింది. అల్లు అరవింద్ – ఎన్.వి ప్రసాద్ లు కలిసి నిర్మించే పనిలో ఉన్న ఈ సినిమాని జనవరి లేదా ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు. ప్రసతుతం చరణ్ కి జోడీ కట్టే హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు