జోర్డాన్ లో స్టెప్స్ ఫినిష్ చేసిన రామ్ చరణ్.!

జోర్డాన్ లో స్టెప్స్ ఫినిష్ చేసిన రామ్ చరణ్.!

Published on Sep 3, 2014 1:34 PM IST

Ram-charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గోవిందుడు అందరివాడేలే’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అబ్రాడ్ లో జరుగుతోందని ఇది వరకే తెలియజేశాం. మొదట లండన్ లో షూటింగ్ మొదలు పెట్టిన ఈ చిత్ర టీం ఆ తర్వాత రామ్ చరణ్ పై షూట్ చేయనున్న సాంగ్ కోసం జోర్డాన్ వెళ్ళారు. అక్కడ అందమైన లోకేషన్స్ లో రామ్ చరణ్ పై పాటని చిత్రీకరించారు. ఆ పాట షూటింగ్ నేటితో ముగియడంతో ఈ చిత్ర టీం తిరిగి లండన్ బయలు దేరారు.

‘జోర్డాన్ లో ఓ రాకింగ్ సాంగ్ ని షూట్ చేసాము. ఈ పాత మూవీ లవర్స్ కి పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది. ప్రస్తుతం జోర్డాన్ నుంచి లండన్ వెళ్తున్నామని’ బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్ చేసారు. రేపటి నుంచి లండన్ లో మొదలు కానున్న షెడ్యూల్ సెప్టెంబర్ 12వరకూ జరగనుంది. లండన్ షెడ్యూల్ తర్వాత ఇండియాకి తిరిగి వచ్చి మిగిలి ఉన్న ఓ పాటని మరియు ఫైనల్ టాకీ పార్ట్ ఎపిసోడ్స్ ని హైదరాబాద్ లో షూట్ చేస్తారు.

రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కుటుంబకథా చిత్రాలు తీయడంలో మంచి పేరు ఉన్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చరణ్ కెరీర్లో మరచిపోలేని సినిమాగా బండ్ల గణేష్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్, జయసుధ, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు