Like us on Facebook
 
అభిమాని మరణంతో షాక్ కి గురైన రామ్ చరణ్..!


మగధీర డైలాగులతో సోషల్ మీడియాలో రామ్ చరణ్ చిట్టి అభిమాని పరశురామ్ పాపులర్ అయ్యాడు. మహబూబ్ నగర్ కు చెందిన ఈ చరణ్ అభిమాని కామెర్లతో నిన్న మృతి చెందాడు. మగధీర డైలాగులతో పాపులర్ అయిన ఇతడిని మెగా అభిమానులు బాల ధీర అని పిలుచుకుంటారు.

పరశురామ్ మరణ వార్త విన్న చరణ్ షాక్ కి గురయ్యాడు. తన పేస్ బుక్ పేజ్ లో అభిమాని మృతి పై స్పందించాడు. పరశురామ్ తన తమ్ముడి లాంటి వాడని, అతని మరణంతో మాటలు రావడం లేదని చరణ్ అన్నాడు. పరశురామ్ మృతి పట్ల అతని కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశాడు.

Bookmark and Share