రామ్ చరణ్ ‘రక్షక్’ షూటింగ్ అప్డేట్

రామ్ చరణ్ ‘రక్షక్’ షూటింగ్ అప్డేట్

Published on Feb 9, 2016 7:37 PM IST

ram-charan1
మెగాస్టార్ చిరంజీవి అతిధి పాత్రలో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేసిన ‘బ్రూస్ లీ – ది ఫైటర్’ సినిమా తర్వాత చరణ్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇక విరామానికి సెలవిచ్చి కంటిన్యూగా తన సినిమాలను మొదలు పెట్టడానికి సిద్దమయ్యాడు. తన తదుపరి సినిమా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. తమిళంలో హిట్ అయిన ‘తని ఒరువన్’కి రీమేక్ గా రూపొందనున్న ఈ సినిమాలో చరణ్ ఓ ఐపిఎస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు, అందుకే ఈ సినిమాకి ‘రక్షక్’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. తమిళ వెర్షన్ లో విలన్ గా నటించిన అరవింద్ స్వామి తెలుగులో కూడా విలన్ గా నటించనున్నాడు.

చాలా రోజుల నుంచి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని చూస్తున్న మెగా అభిమానులకు శుభవార్త. రామ్ చరణ్ – సురేందర్ రెడ్డి సినిమాని త్వరలోనే అధికారికంగా లాంచ్ చేసి ఫిబ్రవరి 21 నుంచి ఫస్ట్ షెడ్యూల్ ని మొదలు పెట్టనున్నారు. ప్రస్తుతం చరణ్ ఈ సినిమా కోసం తన లుక్ అండ్ ఫిజిక్ ని మార్చే పనిలో ఉన్నాడు. అలాగే ఈ చిత్ర టీం హీరోయిన్ గా టాలీవుడ్ గోల్డెన్ గర్ల్ రకుల్ ప్రీత్ సింగ్ ని ఫైనల్ చేసే పనిలో ఉంది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించనున్న ఈ సినిమాకి హిప్ హాప్ తమిజా మ్యూజిక్ అందించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు