రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ లాంచ్ డీటైల్స్

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ లాంచ్ డీటైల్స్

Published on Oct 6, 2015 3:17 AM IST

Ram-charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘బ్రూస్ లీ’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మరో మూడు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. అలాగే మరో వారంలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి అనుకున్నట్టుగానే దసరా కానుకగా అక్టోబర్ 16న ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ తన తదుపరి సినిమాకి సైన్ చేసేసాడు. ఇటీవల తమిళంలో వచ్చిన సూపాట్ హిట్ మూవీ ‘తని ఒరువన్’ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.

ఇటీవలే రామ్ చరణ్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ లో ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేసి డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. డివివి దానయ్య – ఎన్.వి ప్రసాద్ కలిసి ఈ సినిమాని నిర్మించనున్నారు. బ్రూస్ లీ రిలీజ్ తర్వాత సురేందర్ రెడ్డి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళేలోపు చరణ్ తను నిర్మాతగా చేయనున్న చిరు 150వ సినిమాకి కూడా లైన్ క్లియర్ చేయనున్నాడు. దాదాపుగా అటు చిరు 150వ సినిమా, ఇటు చరణ్ నెక్స్ట్ మూవీ ఒకే టైం కి సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు