రామ్ చరణ్ సరసన శ్రుతి హాసన్..?

రామ్ చరణ్ సరసన శ్రుతి హాసన్..?

Published on Jul 25, 2014 2:30 AM IST

Ram-Charan,-Shruti-Haasan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన శ్రుతి హాసన్ మరోసారి రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యిందా..? అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా డివివి దానయ్య నిర్మిస్తున్న సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ ను తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. నవంబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆగడు’ సినిమాలో ప్రత్యెక గీతంలో నటించింది. మెగా హీరోలతో హట్రిక్ విజయాలను అందుకుంది. ‘రేసుగుర్రం’ సినిమా తర్వాత తెలుగులో మరో సినిమాకి సైన్ చేయలేదు శృతి. చరణ్ – శ్రీను వైట్ల సినిమా అయినా ఓకే అవుతుందో..? లేదో..?

సంబంధిత సమాచారం

తాజా వార్తలు