బ్లైండ్ ఫోల్డ్ వాక్ కి సపోర్ట్ ఇచ్చిన రామ్ చరణ్

బ్లైండ్ ఫోల్డ్ వాక్ కి సపోర్ట్ ఇచ్చిన రామ్ చరణ్

Published on Oct 4, 2015 3:36 PM IST

Ram-charan
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా హీరోగా పరిచయం అయిన రామ్ చరణ్ తన సినిమాలతో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటూ ఉన్నాడు. కేవలం ఒక హీరోగానే కాకుండా సామాజిక సేవ చేయడంలోనూ తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకెళ్తున్నాడు. ఇప్పటికే చిరు తన ఐ బ్యాంకు ద్వారా ఎంతోమంది కళ్ళు లేని వారికి చేయూతని ఇచ్చాడు. ఆ విషయంలో చరణ్ కూడా తన సపోర్ట్ ని ఇచ్చాడు. అంతే కాకుండా తాజాగా కళ్ళులేని వికలాంగుల కోసం వరల్డ్ సైట్ డే ని పురష్కరించుకొని హైదరాబాద్ లోని ఓ ఐ హాస్పిటల్ ఆర్గనైజ్ చేసిన ది బ్లైండ్ ఫోల్డ్ వాక్ కి రామ్ చరణ్ ముక్య అతిధిగా విచ్చేసాడు.

ఈ రోజు ఉదయం 6 గంటలకు హైదరాబద్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డెన్వర్ ఫౌండేషన్ బ్లైండ్ పీపుల్ తో రంక్ హరన్ ఇంటరాక్ట్ అయ్యాడు. వారితో కలిసి కాసేపు మాట్లాడటమే కాకుండా, వారితో సెల్ఫీలు దిగి వారినిని ప్రోత్సహించాడు. అంతే కకుండా చరణ్ తన రాబోయే ‘బ్రూస్ లీ’ సినిమాని అక్టోబర్ 15న స్పెషల్ స్క్రీనింగ్ వేయిస్తా అని మాట కూడా ఇచ్చాడు. వారితో కాసేపు సరదాగా గడిపిన రామ్ చరణ్ ఆ కార్యక్రమం అయ్యాక అటు నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం బ్రూస్ లీ చివరి దశ షూటింగ్ జరుగుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు