అలా చేస్తే నాన్నగారిలా గొప్ప స్థాయికి వెళతామంటున్న చరణ్ !


మెగాస్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘రంగస్థలం’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మొదటి నుండి చరణ్ తండ్రి చిరంజీవి బాటలోనే పయనిస్తూ మెగా అభిమానుల్ని ఎక్కడా నిరాశపరచకూడదనే ఉద్దేశ్యంతో కష్టపడుతూ వస్తున్నారు. తానేన్ని విజయాలు సాధించిన వాటికి కారణం తండ్రి, కుటుంబమేనని చెప్పే చరణ్ తాజాగా ఈరోజు ఫాథర్స్ డే సందర్బంగా అందరి కంటే తమని ఎక్కువగా నమ్మి, తమకు ఇంత గొప్ప స్థాయిని ఇచ్చిన తన తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు.

అంతేగాక తాను కూడా తన నాన్నలాగా సినిమాకు సంబందించిన వర్క్, స్ట్రెస్ వంటి వాటిని ఇంటి వరకు రానివ్వకుండా ఉండటానికి ట్రై చేస్తుంటానని, నాన్నగారు ఈ స్థాయికి రావడానికి క్రమశిక్షణే కారణమని, ఆ వయసులో కూడా ఖైదీ సినిమా షూటింగ్ కోసం ఉదయం ఐదున్నరకు లేచి, ఏడున్నరకు సెట్ కు వెళ్లేవారని అలాంటి క్రమశిక్షణ అలవాటు చేసుకోగలిగితే మేము కూడా ఆయనలా గొప్ప స్థాయికి వెళ్లగలమని చెబుతూ తండ్రితో తనకున్న అనేక జ్ఞాపకాలను మీడియాతో పంచుకున్నారు.

 

Like us on Facebook