త్వరలో క్లారిటీ ఇస్తాం – 150వ సినిమాపై చిరంజీవి తనయుడు

త్వరలో క్లారిటీ ఇస్తాం – 150వ సినిమాపై చిరంజీవి తనయుడు

Published on Aug 22, 2014 4:30 PM IST

ram-charan
3 దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరించిన మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలో నటించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆగస్ట్ 22న చిరు బర్త్ డే సందర్భంగా 150వ సినిమా విశేషాలు ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అభిమానులు కూడా ఈ రోజు కోసం ఎంతగానో ఎదురుచూశారు. అయితే చిరంజీవి 150వ సినిమా వివరాలు నెల రోజులలో వెల్లడిస్తామని చిరు తనయుడు రామ్ చరణ్ వెల్లడించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకులో జరిగిన బర్త్ డే సెలెబ్రేషన్స్ లలో అల్లు అరవింద్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ, వరుణ్ తేజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

150వ సినిమా పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటుంది. ప్రస్తుతం కథ రెడీ అయ్యింది, ఇద్దరు ముగ్గురు దర్శకులతో చర్చలు జరుపుతున్నాం. ప్రేక్షకులు, సినిమా ప్రముఖులు 150వ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ విషయం నాకు తెలుసు. వారందరినీ మెప్పించేలా ఉంటుంది. చిన్నపాటి సందేశంతో కూడిన వినోదత్మక సినిమా అని ఇటివల ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి వెల్లడించారు. 150వ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు