హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్..!

హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్..!

Published on Oct 22, 2014 1:04 PM IST

Ram-Charan
‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా విడుదలై 20 రోజులు దాటింది. ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ఇప్పటివరకూ తన కొత్త సినిమా వివరాలు వెల్లడించలేదు. ‘గోవిందుడు…’ సినిమాను అనుకున్న తేదికి విడుదల చేయడం కోసం రామ్ చరణ్ తో పాటు యూనిట్ మొత్తం చాలా శ్రమించారు. రెగ్యులర్ షూటింగ్ మొదలైన తర్వాత రెస్ట్ లేకుండా వర్క్ చేశారు. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా విజయం సాధించడంతో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు.

‘గోవిందుడు..’ విడుదల తర్వాత రెండు నెలల పాటు రెస్ట్ తీసుకోవాలని రామ్ చరణ్ డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం చరణ్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. అందువల్ల కొత్త సినిమా కబుర్లు వినిపించడం లేదు. కోన వెంకట్ – గోపి మోహన్ చెప్పిన కథ చరణ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే మరో అగ్ర దర్శకుడితో సినిమా చేయడానికి అంగీకరించారని సమాచారం. మొదట ఎవరి సినిమా ప్రారంభమవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు. నిర్మాత డివివి దానయ్య బ్యానర్ లో సినిమా ఉండే అవకాశం ఉంది. రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాపై అనేక వార్తలు, ఊహాగానాలు వస్తున్నాయి. అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు