‘ఖైదీ’ కలెక్షన్స్‌ను రామ్ చరణ్ స్వయంగా ప్రకటిస్తాడట!

‘ఖైదీ’ కలెక్షన్స్‌ను రామ్ చరణ్ స్వయంగా ప్రకటిస్తాడట!

Published on Jan 18, 2017 11:04 AM IST

ram-charan
మెగాస్టార్ చిరంజీవి తన రీ ఎంట్రీ సినిమా అయిన ‘ఖైదీ నంబర్ 150’తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. తొమ్మిదేళ్ళ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా కూడా ఎక్కడా ఆయన క్రేజ్ తగ్గలేదని బాక్సాఫీస్ కలెక్షన్స్ ఋజువుచేసేస్తున్నాయి. ఇక నిన్నటితో వారం పూర్తిచేసుకున్న ఈ సినిమా నేటినుంచి విజయవంతంగా రెండోవారంలోకి అడుగుపెట్టింది. మొదటివారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక, ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న అన్ని తెలుగు సినిమా మార్కెట్‌లలో ఖైదీ రికార్డు కలెక్షన్స్ సాధించిందని తెలుస్తోంది.

ఇప్పటికే దాదాపుగా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు రాబట్టింది. ఈ సాయంత్రం నిర్మాత అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా ఖైదీ నంబర్ 150 కలెక్షన్స్‌ను ప్రకటించనున్నారు. కలెక్షన్స్ విషయంలో రకరకాల నెంబర్స్ వినిపిస్తూ ఉండడంతో రామ్ చరణ్ అధికారికంగా ప్రకటించే నెంబర్స్‌పైనే ఇప్పుడు అందరి ఆసక్తి నెలకొంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిరు స్టైల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో కాజల్ హీరోయిన్‌గా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు