థియేటర్లలోనే ‘ఖైదీ’ని చూస్తానన్న చరణ్!

ram-charan
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ‘ఖైదీ నెం. 150’ అన్న సినిమా ప్రస్తుతం తెలుగు సినీ అభిమానుల్లో ఎక్కడ చూసినా హాట్ టాపిక్. అభిమానులంతా ఈ సినిమా కోసం ఎప్పట్నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అభిమానులతో పాటు చిరంజీవి తనయుడు, ఖైదీ నెం. 150 నిర్మాత కూడా అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సినిమాను థియేటర్లలోనే చూస్తారట. ఇప్పటికైతే కొన్ని అక్కడక్కడా బిట్స్‌ చూశానని, పూర్తి సినిమా మాత్రం థియేటర్లలో, అభిమానులతో పాటే చూస్తానని ఆయన తెలిపారు.

విడుదలకు ముందే సినిమా చూసే అవకాశం ఉన్నా, తాను థియేటర్లలోనే చూడాలనుకుంటున్నట్లు చరణ్ స్పష్టం చేశారు. చిరంజీవికి తానూ పెద్ద అభిమానినని, ఆయన డ్యాన్స్, ఫైట్స్ చూడాలని ఎంతగానో ఎదురుచూస్తున్నానని చరణ్ ఈ సందర్భంగా అన్నారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న సినిమా విడుదల కానుంది.

 

Like us on Facebook