టైటిల్ సాంగ్ కోసం కండలు పెంచుతున్న రామ్ చరణ్

ram-charan
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చేస్తున్న తాజా చిత్రం ‘ధృవ’ పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. గత సినిమాలు ‘బ్రూస్లీ, గోవిందుడు అందరివాడే’ వంటి చిత్రాలు ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో చరణ్ కూడా ఈ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుని కష్టపడుతున్నాడు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ అనుకున్నట్టే మంచి స్పందనను రాబట్టుకుంది. ఇప్పటికే టాకీ పార్టీ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో టైటిల్ సాంగ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ పాటను నవంబర్ 2వ తేదీ నుండి షూట్ చేయడం మొదలుపెడతారు.

సినిమా మొత్తానికి హైలెట్ గా నిలవనున్న ఈ టైటిల్ సాంగ్ కోసం చరణ్ తన బాడీ లాంగ్వేజ్ ని, లుక్స్ ని పూర్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే జిమ్ లో వర్కవుట్లు చేస్తున్నాడు. నిన్న దీపావళి పండుగ అయినా సరే చెర్రీ వర్కవుట్స్ ఆపలేదు. ఇదే విషయాన్ని ఆయన భార్య ఉపాసనా తెలుపుతూ ట్విట్టర్లో చరణ్ వర్కవుట్స్ చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఇక గీతా ఆర్ట్స్ పతాకం పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపంచనున్నాడు.

 

Like us on Facebook