‘ధృవ’ టైటిల్ సాంగ్ నా ఫేవరైట్ : రామ్ చరణ్

dhruva

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న పోలీస్ థ్రిల్లర్ ‘ధృవ’ మరో నెలరోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోన్న విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతున్నాకొద్దీ సినిమా కోసం ఎదురుచూస్తోన్న అభిమానుల ఉత్సాహం రెట్టింపవుతూ వస్తోంది. ఇక అనుకున్న తేదీకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేయాలన్న ఉద్దేశంతో టీమ్ శరవేగంగా ప్రొడక్షన్ పూర్తి చేస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ ఇంట్రో సాంగ్‌ను పూర్తి చేసే పనిలో పడిపోయారు.

ఇదే విషయం గురించి చరణ్ తెలియజేస్తూ ఇంట్రో సాంగ్‌ను పూర్తి చేస్తున్నామని, తనకు ధృవ ఆడియోలో బాగా నచ్చిన పాట ఈ ఇంట్రోసాంగేనని రామ్ చరణ్ స్పష్టం చేశారు. నవంబర్ 9న ఈవెంట్ లాంటిదేమీ లేకుండా నేరుగా మార్కేట్లోకే వచ్చేస్తోన్న ఈ ఆడియోను హిపాప్ థమిజా సమకూర్చారు. అల్లు అరవింద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నాటితరం స్టార్ హీరో అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తున్నారు.

 

Like us on Facebook