చిరంజీవి సినిమా ఆధారంగా రామ్ చరణ్ చిత్రం ?


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘నేను లోకల్’ ఫేమ్ త్రినాథరావ్ నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్టు కొద్దిరోజుల క్రితం వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ గురించి తాజాగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రం ‘మంత్రిగారి వియ్యంకుడు’ ను బేస్ చేసుకుని తీయనున్నారట.

అలాగని ఇది రీమేక్ కాదట కేవలం చిరు సినిమా నుండి కొన్ని ముఖ్యమైన అంశాలను మాత్రమే తీసుకుని ప్రస్తుత ట్రెండ్ కు, చరణ్ ఇమేజ్ కు తగ్గట్టు స్క్రిప్ట్ తయారుచేస్తున్నారని వినికిడి. మరి ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవముందో తెలియాలంటే మెగా కాంపౌండ్ నుండి క్లారిటీ వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో ‘రంగస్థలం 1985’ చేస్తున్న చరణ్ అది పూర్తవగానే డైరెక్షన్లో సినిమాను చేయనున్నారు.

 

Like us on Facebook