పవన్ కళ్యాణ్ కోసం ముందుడుగేస్తున్న రామ్ చరణ్ ?


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ‘రంగస్థలం 1985’ చిత్రంపై మెగా అభిమానుల్లో ఎంతటి భారీ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆరంభంలో అనగా సంక్రాంతికి విడుదల చేయాలని మొదట్లో ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఈ విడుదల తేదీ కాస్త ముందుకు జరిగినట్టు వార్తలొస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే త్రివిక్రమ్ తో కలిస్ పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రం కొంచెం ఆలస్యం అయ్యేలా ఉండటంతో దాన్ని ఈ సంవత్సరం కాకుండా 2018 సంక్రాంతికి రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. దీంతో డిసెంబర్ క్రిస్టమస్ బరి ఫ్రీ అవడంతో రంగస్థలాన్ని చక చకా పూర్తిచేసి క్రిస్టమస్ నాటికి రిలీజ్ చేసి సంక్రాంతి సీజన్ ను పవర్ స్టార్ సినిమాకు వదిలేయాలని అనుకుంటున్నారట. అయితే ఈ విషయంపై ఇంకా స్పష్టమైన ప్రకటన ఏదీ వెలువడలేదు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సమంత కథానాయకిగా నటిస్తోంది.

 

Like us on Facebook